ఈ భూమండలంలో మనుషులతో పాటుగా ఎన్నో జీవరాశులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి.కానీ వీటన్నీంటికి లేని ప్రత్యేకత మానవులకు ఉంది.
అందుకే కావచ్చూ అత్యాశ, కుతూహలం వంటి ఇతర మానసిక రుగ్మతల వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాడు.
ప్రకృతి నుండి ఉచితంగా వచ్చే వాటిని డబ్బులు పోసి కొనుక్కునే స్దాయికి దిగజారాడు.
ఇతరులపై ఆధిపత్యం చేయాలనే తపనతో ఊహించని విధ్వంసాలకు పాల్పడుతూ మానవుని మనుగడను ప్రమాదంలో పడవేస్తున్నాడు.మొత్తానికి ఇలాంటి కౄరమైన ఆలోచనల నుండి పుట్టిందే కరోనా అనే వైరస్.
దీన్ని ప్రపంచం మీదికి వదిలిన వారు ఏవరోగానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఇదిలా ఉండగా ఈ వైరస్‌ను ఎదుర్కొనెందుకు కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
అందులో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి.

అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్నాగానీ యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని ఆరోపిస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాపై లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి కేసు పెట్టాడు.ఈ ఫిర్యాదులో ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, డీసీజీఏ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ పేర్లనూ నమోదు చేశాడు.అయితే ఇతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదట.
దీంతో తాను కోర్టుకు వెళతానని ప్రతాప్ చంద్ర హెచ్చరిస్తున్నాడట.