ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్‌కి క్రమక్రమంగా ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ ఇప్పటివరకు కీలక ఆధారాలు సేకరించింది.
ఈ క్రమంలోనే వంద కోట్ల ముడుపుల్లో ఎమ్మెల్సీ కవిత పాత్రపై ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైందని సమాచారం.
ఇప్పటికే అభిషేక్ బోయనపల్లి, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవలు ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించనున్నారు అధికారులు.కాగా మద్యం కుంభకోణం వంద కోట్ల చుట్టే తిరుగుతోంది.ఈ కేసుపై అటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇటు సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.మరోవైపు మనీశ్ సిసోడియాతో పాటు అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.