మనకు తెలియదు గానీ.ఈ భూమ్మీద చాలా రకాల జంతువులు ఉన్నాయి.
ఇప్పటికీ రోజుకో రకమైన జంతువు కంటపడుతూనే ఉంది.అటు సముద్రంలో, ఇటు భూమ్మీద ఇలాంటి వింత జంతువులు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి.
వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంటాయి.అసలు ఈ సోషల్ మీడియా రాకముందు కూడా ఇలాంటి జంతువులు అనేకం కనిపించాయి.
కానీ అవి కనిపించిన వారి వరకే పరిమితం అయ్యేవి.కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అనేక జంతువులు చాలామందికి తెలుస్తున్నాయి.
ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు ఓ డిఫరెంట్ కప్పను తీసుకు వస్తున్నాం.మనకు తెలిసినంత వరకు కప్పలు అంటే భూమ్మీద గెంతుతూ కనిపిస్తాయి కదా.
మరి వాటికి ఏమైనా మెరిసే గుణాలు ఉన్నాయా అంటే లేవు అనే అందరూ సమాధానం చెప్తారు.కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న కప్పను చూస్తే మాత్రం మీ ఒపీనియన్ మార్చుకుంటారు కాబోలు.
ఎందుకంటే ఆ కప్ప కడుపులో ఓ లైటు వెలుగుతోంది.ఏంటి వినడానికి ఆశ్చర్యకరంగా ఉందా.
కానీ మీరు విన్నది నిజమేనండి బాబు.ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ కప్ప ఓ ఇంట్లోని గోడను ఉండటం చూడొచ్చు.అయితే దాని కడుపులో అప్పుడప్పుడు ఓ లైటు వెలుగుతోంది.అచ్చం లైటు మాదిరిగానే బ్లూ కలర్ లో వెలుగుతోంది.అంటే ఆ కప్పలో అలాంటి లైటు వెలిగే గుణం ఏమైనా ఉందో తెలీదు.ఒకవేళ అదేమైనా లైటు పురుగును మింగేసిందో కూడా తెలియదు.కానీ అలా వెలగడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ కప్ప ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్యక్తి తెలియజేయలేదు.కానీ తన ఇంట్లో కప్ప కడుపులో ఇలా లైటు వెలుగుతోందంటూ రాసుకొచ్చాడు.
దీనిపై చాలా భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.