అక్కడ లియో సెన్సేషన్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో రఫ్ఫాడిస్తున్న విజయ్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన అది సంచలనమే.అంతగా ఈ హీరో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

 Leo Uk Advance Bookings Are Record-breaking, Thalapathy Vijay, Bollywood , T-TeluguStop.com

తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకుని దూసుకు పోతున్న విజయ్ చేస్తున్న సినిమాలన్నీ కోట్లకు కోట్లు రాబడుతూ నిర్మాత జేబులను నింపుతున్నాయి.విజయ్ కు ప్లాప్ సినిమాకు కూడా 200 కోట్లను రాబట్టే సత్తా ఉంది.

అందుకే ఈయన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.కోలీవుడ్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు మార్కెట్ ఉంది.

అందుకే రిలీజ్ కు ముందే ఈయన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.ఇదిలా ఉండగా ఈ బిజినెస్ కు తగ్గట్టుగానే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో‘ ( LEO Movie )సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.అందుకే అలా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఇలా రికార్డ్ సెట్ చేస్తుంది.తాజాగా ఈ సినిమా యూకే లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు.అలా ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 10 వేళకి పైగానే టికెట్స్ బుక్ అవ్వగా రికార్డ్ క్రియేట్ అయ్యింది.

ఇక ప్రజెంట్ ఈ సినిమా అక్కడ 18 వేలకి పైగానే ప్రీ సేల్స్ లో టికెట్స్ బుక్ చేసుకుంది.దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube