తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత తమదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ మేరకు తొలి రోజే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించామని తెలిపారు.
ఆర్థికపరమైన చిక్కులు ఉన్నా గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.అలాగే ఈనెల 28 నుంచి ప్రజాపాలన సభలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ప్రభుత్వమే ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించామన్న పొంగులేటి ఈ సభల్లో పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా ఆరు గ్యారెంటీలను ఇవ్వాలన్నది ఇందిరమ్మ రాజ్యం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.