తిరుమలలో బీజేపీ నేత వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం కవిత రూ.150 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తరహాలోనే కవిత కూడా అరెస్ట్ అవుతారని వివేక్ వ్యాఖ్యనించారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు పార్టీకి నిధులు లేవన్న ఆయన రాష్ట్ర ఖజానాను కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీ వాళ్లు రూ.400 కోట్లతో విమానం కొన్నారన్నారు.ప్రస్తుతం దేశంలోనే ధనిక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.