అమెరికాలోని యూఎస్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్.వెటరన్స్ వైద్య అవసరాలను తీర్చడానికి గాను హెచ్ 1 బీ వీసాలపై( H1B visas ) విదేశీ ఆరోగ్య సంరక్షణ నిపుణులను నియమించుకునే లక్ష్యంతో చట్టాన్ని ప్రవేశపెట్టింది.
‘Expanding Health Care Providers for Veterans Act’ పేరిట కాంగ్రెస్‌కు చెందిన రషీదా త్లైబ్, డెలియా రామిరేజ్‌లు( Rashida Tlaib, Delia Ramirez ) బుధవారం దీనిని కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.ఇది చట్టంగా మారితే.
వెటరన్ అఫైర్స్, స్టేట్ వెటరన్స్ హోమ్‌లు అమెరికాలో తగిన దరఖాస్తుదారుని కనుగొనలేనప్పుడు హెచ్ 1 బీ వీసాలపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వీలు కలుగుతుంది.ప్రత్యేకంగా ఈ బిల్లు హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ ప్రయోజనాల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్, స్టేట్ వెటరన్స్ హోమ్‌లను క్యాప్ మినహాయింపు సంస్థలుగా నిర్దేశిస్తుంది.
ఈ సందర్భంగా రషీదా మాట్లాడుతూ.వెటరన్స్ దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతలు చెప్పలేమన్నారు.ప్రతి వెటరన్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన మద్ధతును కలిగి వుండేలా మనం చర్యలు తీసుకోవాలన్నారు.వెటరన్స్ కోసం వలస వచ్చిన ఆరోగ్య సంరక్షణ నిపుణులను స్వాగతించేందుకు ఈ చట్టాన్ని ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా వుందని త్లైబ్ పేర్కొన్నారు.
ఇక వెటరన్స్ అఫైర్స్‌పై హౌస్ కమిటీ సభ్యురాలు , కాంగ్రెస్ సభ్యురాలైన డెలియా రామిరేజ్ మాట్లాడుతూ.ప్రస్తుతం దేశాన్ని ఆరోగ్య కార్యకర్తల కొరత వేధిస్తోందన్నారు.ఈ నేపథ్యంలో వెటరన్స్ యోగ క్షేమాలను చూసుకోవాల్సిన బాధ్యత మనపై వుందని ఆమె వ్యాఖ్యానించారు.తాము మా కమ్యూనిటీలలోని వలసదారులతో ఈ కొరతను పరిష్కరించగలమని.ఇందుకు వారు కూడా సిద్ధంగానే వున్నారని డెలియా చెప్పారు.
కాగా.డెట్రాయిట్‌లోని వెటరన్ అఫైర్స్ మెడికల్ సెంటర్ , దాని మెథడోన్ క్లినిక్‌ను( methadone clinic ) మూసివేసే దశలో వున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ 1 బీ వీసా క్యాప్ పరిమితులకు లోబడి నియామకాలు లేకపోవడంతో వెటరన్స్ కోసం కాంగ్రెస్ సభ్యులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
డెట్రాయిట్‌లోని వీఏ మెడికల్ సెంటర్‌లో దాదాపు 90 మంది వరకు వెటరన్స్ వైద్య సేవలను పొందుతున్నారు.కాంగ్రెస్ సభ్యురాలు త్లైబ్ జోక్యం చేసుకుని ఈ క్లినిక్ పూర్తిగా మూతపడకుండా నిరోధించగలిగారు.
అయితే భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ చట్టాన్ని ఇప్పటికే ‘‘ ది వెటరన్స్ ఫర్ పీస్ సేవ్ అవర్ వీఏ నేషనల్ ప్రాజెక్ట్’’, ‘‘అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్’’లు ఆమోదించాయి.