ఓరి మీ పిచ్చి తగలెయ్య.. పేకాట ఆడుతూ కారు స్టీరింగ్ వదిలేసారుగా..!

సాధారణంగా కార్లను నడిపేటప్పుడు పూర్తి శ్రద్దను రోడ్డుపై పెట్టాలి.అలాగే స్టీరింగ్ ఫుల్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

 Left The Steering Wheel Of The Car While Playing Poker Viral Video, Viral News,-TeluguStop.com

లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ.కాగా తాజాగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి కారు స్టీరింగ్ వదిలేసి తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంచక్కా పేకాట ఆడుకున్నాడు.

ఆ సమయంలో కారు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.దీనికి సంబంధించిన వీడియోని వారు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

దీన్ని చూసిన చాలామంది ‘మీ పేకాట పిచ్చి తగలెయ్య, కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు వెళ్తున్న కారు పేరు మహీంద్రా ఎక్స్‌యూవీ 700.

ఇది అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) టెక్నాలజీతో వస్తుంది.అందువల్ల స్టీరింగ్ వదిలేసినా అది కంట్రోల్ తప్పి ఎలా పడితే అలా వెళ్లే ఛాన్స్ తక్కువ.

అందుకే వీరు ధైర్యంగా స్టీరింగ్ వదిలేసి సరదాగా పేకాట ఆడితే ఎంజాయ్ చేస్తున్నారు.అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ టెక్నాలజీ డ్రైవర్‌ను ప్రతి కొన్ని నిమిషాలకు అలర్ట్ చేస్తుంది.

తద్వారా డ్రైవర్ కారు ముందు ఏం వెళ్తున్నాయో, ఏం వస్తున్నాయో చూసుకొని దానికి తగినట్లుగా జాగ్రత్త పడటం కుదురుతుంది.

అయితే పూర్తిగా టెక్నాలజీ పై ఆధారపడి ఇలా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించడానికి కాస్త ప్రమాదకరమే.అందుకే, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న మీరు పై ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కొందరి నెటిజన్లు కోరుతున్నారు.కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube