వరుణ్ తేజ్ లో లావణ్యకు నచ్చే క్వాలిటీ ఇవేనా.. భర్తకు స్పెషల్ విషెస్ చెప్పిన లావణ్య!

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలో అలాగే వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన నటి లావణ్య త్రిపాటి ( Lavanya Tripati ) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

 Lavanya Tripati Wished Her Husband Varun On His Birthday Special , Varun Tej, La-TeluguStop.com

వీరిద్దరి వివాహం గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పెళ్లి తర్వాత మెగా కోడలు మెగా కుటుంబ సభ్యులు అందరితో కలిసిపోయి ఎంతో సరదాగా గడుపుతున్నారు.

ఇటీవల మెగా సంక్రాంతి సంబరాలలో కూడా లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు వరుణ్ అలాగే లావణ్యకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కూడా తన భర్తకు స్పెషల్ గా విషెస్ చెబుతూ తనలో నచ్చిన క్వాలిటీస్ అన్నింటిని బయటపెట్టారు.

ఈ సందర్భంగా వరుణ్ తో లావణ్య కలిసి ఉన్నటువంటి కొన్ని రొమాంటిక్ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే వరుణ్ అంటూ విష్ చేయడమే కాకుండా మీరు ఒక రకమైన, నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి.మీలో నాకు నచ్చింది ఇతరులను ప్రేమించే, ఇతరులపై శ్రద్ధ వహించే మీ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పింది.ఇలా లావణ్య త్రిపాటి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube