నిర్మల్ జిల్లాలో ఇండస్ట్రీ కోసం గతంలో మూడు వందల ఎకరాలు కేటాయించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.60 ఎకరాల్లో కూడా పరిశ్రమలు రాలేదని మండిపడ్డారు.
మాస్టర్ ప్లాన్, ధరణి పేరుతో భూములను లూటీ చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు.పాత ప్రాంతాలకే ఇండస్ట్రీలు రానప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్స్ ఎందుకని ప్రశ్నించారు.220 జీవో తెచ్చి రైతుల కళ్లలో మట్టి కొడుతున్నారని విమర్శించారు.రైతుల భూములు తక్కువ ధరకు తీసుకొనే కుట్రలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు.తన సొంత గ్రామంలోని భూములను రెసిడెన్షియల్ జోన్ గా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించడం న్యాయమా అని ప్రశ్నించారు.