చరిత్ర సృష్టించిన జయశ్రీ.. ఆ తెగ నుంచి తొలి మహిళా పైలట్.. ఈమె సక్సెస్ స్టోరీకి షాకవ్వాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో మంచి మంచి పొజిషన్ లో ఉన్న చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నవారే.అలా కష్టపడి మంచి పొజిషన్లో ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

 Baduga Community In Nilgiris Celebrates Its First Woman Pilot, Baduga Community,-TeluguStop.com

అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి జయశ్రీ( Jayashree ) కూడా ఒకరు.ఇంతకీ జయశ్రీ ఎవరు ఆమె ఏ ఘనత సాధించింది అన్న వివరాల్లోకి వెళితే.

తమిళనాడులోని నీలగిరి కొండల్లో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలు ఉన్నాయి.అక్కడ పెద్ద చదువులు చదివే అమ్మాయిలే తక్కువ.

కానీ ఆ సంప్రదాయాన్ని తిరగరాస్తూ పైలట్‌గా ఎదిగింది జయశ్రీ.నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో ఉన్న కురుకుతి ఈమె స్వస్థలం.

అక్కడి కొండల్లో యుద్ధ విమానాలు, రక్షణశాఖ శిక్షణ విమానాలు చక్కర్లు కొడుతుండటం తరచూ జరిగేదే.

ఆ గ్రామ ప్రజలు వాటిని చూడటమే కానీ, ఏరోజూ వాటిలో ఎక్కిందిలేదు.

ఏనాటికైనా ఆ విమానాలు నడిపే పైలట్‌ అవ్వాలని అనుకుంది జయశ్రీ.అంతేకాకుండా అది ఆమె చిన్ననాటి కల కూడా.

కానీ అందుకు ఏం చదవాలో చెప్పేవాళ్లే ఆ ఊళ్లోలేరు.దాంతో ఆ కలని తాత్కాలికంగా పక్కన పెట్టింది.

కోయంబత్తూరులోని ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్స్‌ సైన్స్‌లో పీజీ చేసింది.తర్వాత పైలట్‌ అవడానికి ఏరోనాటిక్స్‌( Aeronautics ) చదవాలని తెలిసినా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిగా అంత సాహసం చేయలేదు.

జీవితంలో నిలదొక్కుకునేందుకు ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించి బిజినెస్‌ అనలిస్ట్‌గా, సాఫ్ట్‌వేర్‌లు రూపొందించడంలో దిట్టగా మారింది.మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌లోనూ ప్రావీణ్యం సాధించింది.

కానీ కొవిడ్‌ ఆమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది.లాక్‌డౌన్‌ సమయంలో వర్క్‌ఫ్రంహోమ్‌ ఇవ్వడంతో తిరిగి గ్రామానికి వచ్చేసింది జయశ్రీ.

Telugu Pilot, Nilgiris, Story-Latest News - Telugu

ఇంటి నుంచి పనిచేయడం మొదట్లో బాగానే ఉన్నా ఆ నాలుగు గోడలకి పరిమితం కావడం తనకు ఇష్టం లేదు.అలాగని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడమా? అనే ఆలోచనా ఆమెని వెనక్కి లాగినా చివరికి ధైర్యంతో ముందుకు నడిచింది.కాగా జయశ్రీ తండ్రి జె.మణి ( J.Mani )విశ్రాంత గ్రామ పరిపాలనాధికారి, తల్లి మీనామణి ( Meenamani )సంగీత కళాకారిణి.తల్లినుంచి నృత్యం, సంగీతమూ నేర్చుకున్న జయశ్రీ పైలట్‌ అవ్వాలన్న తన ఆలోచనని వాళ్లతో పంచుకుంది.

బిడ్డ ఆసక్తి చూసి వాళ్లూ సరేనని అన్నారు.ఇది తన తొలి విజయంగా జయశ్రీ భావించింది.

ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని, కూనూరు సమీపంలోని వెల్లింగ్టన్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా చేరింది.తను పనిచేసిన 6 నెలల్లో విమానయానం గురించి తెలుసుకుంది.

తర్వాత ఆమె పెట్టుకున్న దరఖాస్తుకు దక్షిణాఫ్రికా లోని ఉల్కన్‌ ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్( Ulkan Aviation Institute ) నుంచి ఆహ్వానం అందింది.చేస్తున్న ఉద్యోగం వదులుకుంది, ఎక్కడికో వెళ్తానంటోంది, ఇంత ఖర్చుపెట్టి అమ్మాయిని విదేశాలకు పంపడం అవసరమా అని బంధువులు చెప్పిన ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆమె ముందడుగు వేసింది.

Telugu Pilot, Nilgiris, Story-Latest News - Telugu

అనుకున్నదే ఆలస్యం జొహన్నెస్‌బర్గ్‌ విమానం ( Johannesburg flight )ఎక్కేసింది.అక్కడ కఠిన శిక్షణను సైతం విజయమంతంగా పూర్తి చేసింది.ప్రైవేటు పైలట్ లైసెన్సునూ సాధించింది.బడుగర్‌ తెగలో ఈ ఘనత సాధించిన తొలి యువతి ఆమె.జయ తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఊరివాళ్లు సంబరం చేసుకున్నారు.పైలట్‌గా 70గంటలు ఆకాశంలో విమానంలో చక్కర్లు కొట్టాను.

ఇక కమర్షియల్‌ పైలట్ లైసెన్సు కోసం పరీక్ష రాయాలి.శిక్షణ కాలంలో 250 గంటలు విమానం నడపాల్సి ఉంటుంది.

దానికీ సిద్ధమే అంటూ గర్వంగా చెబుతోంది.కాగా బడుగ తెగ నుంచి వచ్చి అంతటి విజయాన్ని సాధించిన జయశ్రీ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు.

ఒకవైపు తాను కష్టపడుతూనే మరొకవైపు సామాజిక సేవ చేస్తూ వచ్చింది.ఆమె నివసించే కొండ గ్రామాల్లోని పేద పిల్లలకు చదువు చెప్పడం కోసం యు అండ్ ఐ ట్రస్ట్ లో వాలంటరీగా చేరి ఇంగ్లీషు గణితం నేర్పించింది.

తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమమేధకు సంబంధించిన విద్యలోనూ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.ఐటీ ఉద్యోగం చేసే సమయంలోనే ఈ సేవా కార్యక్రమాలకు కొంత సమయం వెచ్చించేది.

ఒకవేళ పైలట్ గా చేరినా కూడా అవేమీ ఆపను అని అంటుంది జయశ్రీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube