కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు-కేటీఆర్

దేశ రాజకీయాలు నడపాలంటే ఢిల్లీలోనే ఉండాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు భారసా కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ( K.T.Rama Rao ).దేశంలో ఇప్పటికి కూడా మరుగుదొడ్లు లేని ఇల్లు ఉన్నాయి అంటే అది ఇంతకాలం పాలించిన భాజపా కాంగ్రెస్ ల వైఫల్యం కాదా ? అంటూ ఆయన నిలదీశారు.కాంగ్రెస్ భాజపాలు రెండూ ఒక తానులో గుడ్డలేనని , ఒకరిని ఓడించడం కోసం మరొకరితో చేతులు కలపలేమంటూ ఆయన చెప్పుకొచ్చారు .మహారాష్ట్రలో విపక్ష కూటమి సమావేశాన్ని ఉద్దేశిస్తూ, కలవాల్సిందే ప్రజలు అని పార్టీలు కాదు అని ఆయన విమర్శించారు భాజపాకి బీ-టీం అని వస్తున్న విమర్శల పై స్పందించిన కేటీఆర్ నిజంగానే బారాసా భాజపాకు అనుకూలంగా పనిచేస్తున్నట్లయితే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దాడులు చేస్తున్నాయి? అంటూ ఆయన ప్రశ్నించారు.

 Ktr Satires On Congress And Bjp , Ktr , Bjp , Ts Politics , Cm Kcr , Congress ,-TeluguStop.com
Telugu Bandi Sanjay, Cm Kcr, Congress, Delhi, Gujarat, Revanth Reddy, Ts-Telugu

ఇప్పటివరకు పరిపాలించిన ప్రధాన మంత్రులు అందరిలో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీ మాత్రమేనని,దేశాన్ని గుజరాత్ కి దాసోహం చేశారని, ఆయనకు మరొక అవకాశం ఇస్తే ఢిల్లీని తీసుకెళ్లి గుజరాత్( Gujarat ) లో కలిపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఢిల్లీలో ఆఫీసులు ఓపెన్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలను నడిపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడిన తెలంగాణ ఇప్పుడు వరి సాగులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదంతా కేసిఆర్( CM KCR ) ఘనతని, ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Congress, Delhi, Gujarat, Revanth Reddy, Ts-Telugu

అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి( Revanth reddy ) లాంటి థర్డ్ గ్రేడ్ క్రిమినల్ మాట్లాడడం ఏమిటంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులకు భాజపా -కాంగ్రెస్ ఇద్దరూ బాధ్యత వహించాలన్న కేటీఆర్, దేశానికి కొత్త నాయకత్వం అవసరం అంటూ వ్యాఖ్యలు చేశారు.బాజాపా యేతర కాంగ్రెస్ యేతర రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube