నేను ప్లాస్టిక్ బొమ్మను కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ హీరోయిన్?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగ చైతన్య తో కలసి దోచే సినిమాలో నటించింది.

 Kriti Sanon Opens Up Being Body Shamed Says She Is Not A Plastic Doll Details,-TeluguStop.com

ఇక తెలుగు సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలీవుడ్ కీ చెక్కేసింది.

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.బాలీవుడ్ లో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇకపోతే కృతిసనన్ ఇటీవలే మిమి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈమె తన అందంతో యూత్ ని కట్టిపడేసింది.

ఇక సినిమాలోని పరం సుందరి అనే పాటకు స్టెప్పులను ఇరగదీసి కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది.అంతే కాకుండా ఈ పాట కొద్దిరోజుల్లోనే ఫుల్ పాపులర్ అయ్యింది.

ఎక్కడ చూసినా కూడా  ఈ పాట మార్మోగిపోతోంది.ఇకపోతే కృతి సనన్ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కృతిసనన్ సీత పాత్రలో నటించనుంది.ఈ సినిమా తో పాటు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Aadipurush, Bollywood, Kriti Sanon, Mahesh Babu, Plastic Doll, Plastics D

ఇదిలా ఉంటే తాజాగా తన కేరీర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను గురించి, ఆమె శరీర సౌష్టవం గురించి ఎదురైనా కామెంట్లను పంచుకుంది.మొదట ఆమె నవ్వు ని చూసి ఆమె నవ్వితే అసలు బాగుండదు అంటూ విమర్శించారట.అంతే కాకుండా ఆమె పెదాల ఆకృతి మార్చుకోవాలని, ఇంకొందరు ఆమె ముక్కు బాగాలేదని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారు అని ఆమె తెలిపింది.ఇంకొందరు అయితే ఆమె నవ్వినప్పుడు నాసికా రంధ్రాలు ఎర్రబడతాయి హేళన కూడా చేశారట.

తన నడుము సైజుని ఇంకాస్త తగ్గించమని సూచించారట.ఆ సమయంలో కృతిసనన్ నేను ప్లాస్టిక్ బొమ్మ ని కాదు కదా అంటూ.

ఎవరు ఎన్ని మాటలు అన్న పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube