మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ప్రారంభంకు రంగం సిద్దం అయ్యింది.కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు అనేక టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.
గోవింద ఆచార్య అంటూ ఒక పోస్టర్ కూడా విడుదల అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషించారు.కాని ఆ సినిమా టైటిల్ నిజం కాదని, పోస్టర్ కూడా నిజం కాదు అంటూ మెగా వర్గాల నుండి ప్రకటన వచ్చింది.
ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం మరో టైటిల్ అంటూ వార్తలు వస్తున్నాయి.
మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 152 చిత్రానిక ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.
దేవాలయాలు మరియు అక్కడ జరుగుతున్న అవినీతి గురించిన విశేషాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడంటూ సమాచారం అందుతోంది.రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.
కాని అనేక మంది పేర్లు వినిపించాయి.
చిరంజీవికి జోడీగా త్రిష మరియు జెనీలియా అంటూ ప్రచారం జరుగుతోంది.అలాగే చిరంజీవి ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ శివారులో భారీ సెట్టింగ్ నిర్మాణంను చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.