తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలన్న కోమటిరెడ్డి ఎవరికీ 60 సీట్లు రావని తెలిపారు.తెలంగాణలో వచ్చేది హంగ్ మాత్రమేనని పేర్కొన్నారు.కాంగ్రెస్ గాడిలో పడుతోందన్నారు.కొత్తైనా… పాత అయినా… గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని తెలిపారు.ఒంటరిగానే పొరాడుతామని, ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని వ్యాఖ్యనించారు.అదేవిధంగా మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర, బైక్ యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు.