అమెరికాలో తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా, తెలుగు పండుగలు, పూజలు, కార్యక్రమాలు నిర్వహించడంతో ఎన్నో తెలుగు ఎన్నారైల సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే అమెరికాలో ఎంతో మంది తెలుగు వారితో సభ్యత్వాలు కలిగి బలమైన సంస్థగా ఎదిగిన టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) కి కొత్తగా అధ్యక్షుడు ఎన్నికయ్యారు.2020 సంవత్సరానికి గాను కృష్ణా రెడ్డి కోడూరి ని ఎంపిక చేసినట్టుగా ఆ సంస్థ తెలిపింది.
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సంస్థగా పేరొందిన టాంటెక్స్ భాద్యతలని కృష్ణా రెడ్డి ఇకనుంచీ స్వీకరించానున్నారని మాజీ కార్యవర్గం ప్రకటించింది.
ఈ మేరకు ప్రమాణస్వీకారం చేసిన కృష్ణా రెడ్డి తనపై పెట్టిన ఈ భాద్యతని సమర్ధవంతగా నిర్వహిస్తానని, టాంటెక్స్ ద్వారా స్థానికంగా ఉంటున్న తెలుగు వారి అభివృద్ధికోసం పాటు పడుతానని ప్రకటించారు.
2020లో సరికొత్త ఆలోచనలతో అందరిని అలరించే కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.ప్రతీ ఒక్క తెలుగు వారి ఆశీస్సులు తనకి తప్పకుండా ఉండాలని.అందరి సహకారంతో సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు.
సభ అనంతరం తెలుగు వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.రాబోయే సంక్రాంతి సంబరాలని ఎంతో అద్భుతంగా చేపడుతామని ప్రకటించారు.