అమెరికాలో తానా అన్నదానం..!!!

ఆకలితో ఉన్న వాళ్లకి కడుపునిండా అన్నం పెట్టగలిగే అవకాశం ఎంతో మందికి కలుగదు.అంతటి గొప్ప మనసు కూడా చాలా మందికి అరుదుగా ఉంటుంది.

 Tana Annadanam In America 1-TeluguStop.com

సేవలలో అన్నటికంటే కూడా గొప్పదైన సేవ అన్నదాన సేవే.అందుకే అన్నదానం జరిగే ప్రాంతంలో సాక్షాత్తు అన్నపూర్ణా దేవి, విష్ణువు ,సకల దేవతలు అందరూ కొలువై ఉంటారని అంటుంటారు.

ఈ సత్యాన్ని గ్రహించిన ఎన్నో సంస్థలు వారు చేసే సేవలలో అన్నదానాన్ని కూడా చేస్తూ ఎంతో మంది ఆకలి భాదని తీర్చుతూ ఉంటారు.

ఈ కోవలోనే అమెరికాలోని అతిపెద్ద తెలుగు సంఘమైన తానా అన్నదాన వితరణ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది.

అమెరికాలో వివిధ ప్రాంతాలలో ఉంటున్న తానా సభ్యులు ఆయా చోట్ల నిరుపేదల ఆకలి తీర్చడానికి తమవంతు సాయం చేస్తున్నారు.తమ సంస్థ ద్వారా కేవలం తెలుగు పండుగలు, తెలుగు వారి అభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా స్థానిక పేదలకి కూడా సేవలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే

Telugu Tana, Tana Annadanam, Telugu Nri Ups-

అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ తానా విభాగం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా స్థానికంగా ఉన్న సాల్వేషన్ ఆర్మీలో పేదలకి అన్నదానం చేసింది.ఈ సేవా కార్యక్రమానికి తానా సభ్యులు అందరూ హాజరయ్యి స్వయంగా వారే వంటలు చేసి వడ్డించారు.ఈ కార్యక్రమానికి అశోక్ ప్రియా గుత్తికొండ దంపతులు ఆర్ధిక సాయం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube