Pawan Kalyan , Kodali Nani; పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై వైసిపి కీలక నేత,  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( kodali nani ) తీవ్ర స్థాయిలో  విమర్శలు చేశారు.టిడిపి,  జనసేన పొత్తు వ్యవహారంపై నాని స్పందించారు.

 Kodali Nanis Sensational Comments On Pawan Kalyan-TeluguStop.com

ఈ సందర్భంగా పవన్ చంద్రబాబును ఉద్దేశించి నాని మాట్లాడారు.  అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని , పవన్ కళ్యాణ్ ను రక్షించుకోవాల్సిన అవసరం జనసైనికులపై ఉందని నాని అన్నారు.

జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన నాని ‘ చంద్రబాబు( chandrababu ) కు ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరు.మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్ గా పెట్టుకోలేదు.175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం.  కచ్చితంగా చెబుతున్న పవన్ కళ్యాణ్ ను ఓడించేది టిడిపినే.

ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది .వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు,  నాదెండ్లను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు.

Telugu Ap, Janasena, Janasenani, Kodali Nani, Kodalinanis, Pavan Kalyan, Telugud

అధికారంలో ఉన్న ఎన్టీఆర్ నే కూల్చి పడేసిన చంద్రబాబు, నాదెండ్ల( Nadendla ) వారికి పవన్ ఎంత ? మూడు శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి,  20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లు ఇచ్చాడు.జనసేనకి ఇచ్చిన సీట్లలో 10 ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి.  ఇవ్వడానికి చంద్రబాబుకి తీసుకోవడానికి పవన్ కు  సిగ్గుండాలి.  రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు ‘ అంటూ నాని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా టిడిపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Telugu Ap, Janasena, Janasenani, Kodali Nani, Kodalinanis, Pavan Kalyan, Telugud

సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు.నేడు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు ఉంటే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా ? ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే.సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే.

ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం వెసులుబాటును బట్టి ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది .చిల్లర రాజకీయ నాయకుడు చంద్రబాబు చేస్తేనే సంసారం అంటూ నాని విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube