పిల్లి కూనను ఎత్తుకెళ్లడానికి గద్ద ప్రయత్నం.. లాస్ట్ ట్విస్ట్‌కి షాక్..

సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ అయ్యే జంతువుల వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా జంతువుల ఎస్కేప్ వీడియోలు( Animals Escape Videos ) ఆశ్చర్య పరుస్తాయి.

 Kitten Saved By Car Windshield From Being Attacked By Eagle Video Viral Details,-TeluguStop.com

అలాగే జంతువులు ఒక్కోసారి మానవుల సృష్టి వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటాయి.ఆ సమయంలో అవి చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి.

అంతేకాదు, మానవులు ఏర్పరిచిన ప్రొటెక్షన్ వల్ల కొన్ని జీవుల ప్రాణాలు కూడా సేవ్ అవుతుంటాయి.దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

@PicturefoIder ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా ఒక కోటి 84 లక్షల వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియోలో( Viral Video ) కారు కేబిన్ లోపల ఒక పిల్లి కూన( Kitten ) డ్యాష్‌బోర్డుపై కూర్చోవడం మనం చూడవచ్చు.దాన్ని చూసి ఒక గద్ద( Eagle ) కారు ముందు వాలింది.

పిల్లిని ఎత్తుకెళ్లి ఎంచక్కా తినేద్దాం అనుకుంది.తన కాళ్ల పంజాతో దానిని పట్టుకోవాలని పిల్లి పైకి ఎగిరింది.

కానీ విండ్‌షీల్డ్ మధ్యలో ఉండటంతో అది పిల్లి పిల్లను టచ్ కూడా చేయలేకపోయింది.మధ్యలో ఒక అద్దం ఉందని పక్షి అస్సలు గ్రహించలేక పోయింది.

అందుకే తాను పిల్లిని పట్టుకోలేనప్పుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అయింది.ఈ పిల్లికి మ్యాజిక్ తెలుసా ఏంటి అన్నట్లు కూడా అది ఫేస్ పెట్టింది.

తన కాళ్లు విరిగిపోయాయా? పిల్లిని ఎందుకు పట్టుకోలేకపోయా అన్నట్లు అది ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది.తరువాత మళ్లీ పిల్లిని క్యాచ్ చేయడానికి ట్రై చేసింది.మరోసారి కూడా విఫలం కావడంలో అది చివరికి అసలు విషయం అర్థం చేసుకుంది.ఆపై అక్కడి నుంచి ఎరిగిపోయింది.ఈ సంఘటనను కారులో( Car ) ఉన్న యజమాని రికార్డు చేశారు.పిల్లి మొదటగా గద్దను చూసి బయటపడలేదు.

కానీ అది విండ్‌షీల్డ్ పైన( Windshield ) అటాక్ చేస్తుంటే భయపడి వేరే చోటుకు పోయింది.

ఈ వీడియో చూసి గద్ద కన్ఫ్యూజ్ అయిందని చాలామంది నవ్వుకుంటున్నారు.అదే మధ్యలో విండ్ షీల్డ్ లేకపోతే పిల్లి ఇప్పటికే పెద్ద కడుపులో ఉండేదేమో అని మరికొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube