బీజేపీ లో చేరగానే కాంగ్రెస్ పై నిందలేస్తున్న కిరణ్  ! 

ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) ఈరోజు ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బిజెపిలో( BJP ) చేరిపోయారు.కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నారు.

 Kiran Kumar Reddy Starts Criticizing Congress Party After Joining Bjp Details, K-TeluguStop.com

కిరణ్ కుమార్ ని చేర్చుకోవడం ద్వారా అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి దగ్గర కావచ్చు అనే వ్యూహంతో బిజెపి ఆయనను చేర్చుకుంది .కీలకమైన పదవులు ఇస్తామనే హామీతో ఆయనను చేర్చుకున్నారు.ఇదిలా ఉంటే.సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా, 

ముఖ్యమంత్రిగా పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పై( Congress ) కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడుతున్నారు.2014 లో ఆంధ్ర , తెలంగాణ విబజన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.ఎన్నికల్లో కిరణ్ తో పాటు , పార్టీ అభ్యర్థులంతా ఓటమి  చెందడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.2018లో మళ్లీ కాంగ్రెస్ లో  చేరిన కిరణ్ కొద్ది రోజులు పాటు యాక్టివ్ గా ఉన్నా.

Telugu Aicc, India Congress, Apcm, Centralprahlad, Congress, Nallarikiran, Rahul

మళ్లీ సైలెంట్ అయ్యారు.ఇప్పుడు బిజెపిలో చేరిన వెంటనే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.‘ తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఎప్పుడూ ఊహించలేదని , పార్టీ నేతల తప్పుడు నిర్ణయాల వల్ల ఈ చర్య తీసుకున్నానని, రాష్ట్రానికి రాష్ట్రం నష్టపోయిందని,  కాంగ్రెస్ అగ్ర నేతల తప్పుడు నిర్ణయాల వల్ల అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది అంటూ కిరణ్ విమర్శించారు.ప్రజలతో మమేకమైన నాయకుల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవడం లేదని విమర్శించారు.

Telugu Aicc, India Congress, Apcm, Centralprahlad, Congress, Nallarikiran, Rahul

ఇది ఒక రాష్ట్రంలో జరిగిన కథ కాదని, దేశవ్యాప్తంగా జరిగే కదా అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు .కాంగ్రెస్ అధినేత చాలా తెలివైనవాడు.కానీ అతను తనంతట తానుగా ఆలోచించడు.

ఎవరి సలహాలను వినడు.వారికి అధికారం కావాలి .నాయకుడు పాత్ర తెలియదు.పార్టీలో ఎవరికి ఏ పని అప్పగించాలో వారికి తెలియదు అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ ను ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube