టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు( ravibabu ) మంచి గుర్తింపు ఉంది.సినిమాల్లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రవిబాబు నటించి ప్రశంసలు అందుకున్నారు.
అయితే రవిబాబు తండ్రి చలపతిరావు( Chalapathy Rao ) జీవించి ఉన్న సమయంలో ఒక మూవీ ఈవెంట్ లో చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం అయ్యాయి.ఆ కామెంట్లు సినీ అభిమానులను సైతం ఒకింత బాధ పెట్టాయనే సంగతి తెలిసిందే.
తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా చలపతిరావు కెరీర్ ను కొనసాగించగా ఒక్క వివాదం ద్వారా మాత్రం వార్తల్లో నిలిచారు.మా నాన్న చేసిన ఆ కామెంట్ల గురించి నేను ఎక్కడా రియాక్ట్ కాలేదని రవిబాబు అన్నారు.
కానీ మాట్లాడకపోయినా నేను రియాక్ట్ అయ్యానని కొందరు ఫేక్ వీడియోలు వైరల్ చేశారని రవిబాబు చెప్పుకొచ్చారు.మీరు మాట్లాడిన మాటలు ఎవరికైనా బాధను కలిగించి ఉంటే వాళ్లకు క్షమాపణలు చెప్పడం మీ బాధ్యత అని నాన్నతో అన్నానని రవిబాబు వెల్లడించారు.

అది మీకే వదిలేస్తున్నా అని నాన్నతో చెప్పానని ఆయన పేర్కొన్నారు.రవిబాబు రియాక్ట్ అయిన తీరు రైటేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రవిబాబు టంగ్ స్లిప్ కావడం నాన్న దురదృష్టమని రవిబాబు వెల్లడించారు.రవిబాబు డైరెక్షన్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

రవిబాబుకు మళ్లీ పూర్వ వైభవం రావాలని ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.రవిబాబు రెమ్యునరేషన్ పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.రవిబాబు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాలి.రవిబాబు క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.