ఆ అదృష్టం నాగార్జునకు మాత్రమే దక్కిందిగా.. మరో ఏ టాలీవుడ్ హీరోకు దక్కలేదుగా!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

 Nagarjuna Only Sr Hero Who Done Movie With Ramoji Rao, Nagarjuna, Ramoji Rao, To-TeluguStop.com

ఆయన వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కావడం లేదు.అంతేకాకుండా నాగార్జున కెరిర్లో ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ కూడా లేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Nagarjuna, Nagarjunasr, Ramoji Rao, Sr, Tollywood-Movie

అదేమిటంటే.తాజాగా ఈనాడు అధినేత రామోజీరావు( Ramoji Rao ) మరణించిన విషయం తెలిసిందే.నిన్నటి రోజున ఆయన అంత్య క్రియలు కూడా మిగిసాయి.

కాగా ఈయన తన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎన్ని గొప్ప ఆణిముత్యాలు అందించారో మనందరికి తెలిసిందే.ఈ విషయాన్ని సినీ ప్రియులందరూ గుర్తు చేసుకున్నారు.

అయితే రామోజీరావు ఏరోజు కూడా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు తీయాలని ప్రయత్నించలేదు.క్వాలిటీ తప్ప క్వాంటిటీ ముఖ్యమనే సిద్ధాంతం ఆయనది.

అందుకే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో ఉషాకిరణ్ ఏ మూవీ చేయలేదు.

Telugu Nagarjuna, Nagarjunasr, Ramoji Rao, Sr, Tollywood-Movie

కానీ ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది.2001 సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు( singeetham Srinivasa Rao ) దర్శకత్వంలో ఆకాశవీధిలో వచ్చింది.రామోజీ ఫిలిం సిటీ స్థాపించిన తొలినాళ్ళలో అందులో ఉన్న అద్భుతాలను కళ్ళకు కట్టినట్టు చూపించి వాడుకునే క్రమంలో పలువురు దర్శక రచయితలు ఆ దిశగా కథలు రాసుకునేవారు.

హనుమాన్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్ట్స్ గా డ్యూయల్ రోల్ చేసిన చిత్రమిది.నాగార్జున సరసన రవీనా టాండన్ నటించగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

కానీ దురదృష్టం ఏంటంటే ఆకాశ వీధిలో దారుణంగా ఫ్లాప్ అయ్యింది.ఓపెనింగ్స్ భారీగా వచ్చినా ఓవర్ సెంటిమెంట్ తో జనాలకు నచ్చలేదు.

అయినా నాగ్ కు ఈ బ్యానర్ తో ఒక జ్ఞాపకం అలా మిగిలిపోయింది.టయర్ 2 స్టార్లలో ఉషాకిరణ్ సంస్థ తీసిన వాటిలో రాజశేఖర్ మెకానిక్ మావయ్య, జగపతిబాబు మూడుముక్కలాట, రవితేజ ఒక రాజు ఒక రాణి లాంటివి ఉన్నాయి కానీ విచిత్రంగా ఇవన్నీ ఫ్లాప్ అయినవే కావడం గమనార్హం.

అక్కినేని నాగేశ్వరరావుతో డాడీ డాడీ యావరేజ్ గా మిగిలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube