ఆ వ్యాధి వల్ల 48 రోజుల పాటు అలాంటి కష్టాలు.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( Adah Sharma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో నితిన్( Nitin ) నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 Adah Sharma Suffer With Rare Disease, Adah Sharma, Rare Disease, Tollywood, Shoc-TeluguStop.com

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.గత ఏడాది విడుదల అయిన ది కేరళ స్టోరీ ( The Kerala Story )దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.

Telugu Adah Sharma, Adahsharma, Rare, Tollywood-Movie

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అదా శర్మకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా  మారింది.అదేమిటంటే తాజాగా అదాశర్మ తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిపింది.దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కేరళ స్టోరీ సినిమాలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది.ఆ తర్వాత బస్తర్‌ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను.

Telugu Adah Sharma, Adahsharma, Rare, Tollywood-Movie

ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్‌ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10, 12 అరటిపళ్లు తినేదాన్ని.అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్‌, ఫ్లాక్‌ సీడ్స్‌ ఉన్న లడ్డూలు నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్లాను.నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని.

కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది.ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు రావడంతో ఒత్తిడికి గురయ్యాను.

ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్‌ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది.దీని వల్ల పీరియడ్స్‌ ఆగకుండా వస్తూనే ఉంటాయి.

ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజులపాటు నాన్‌ స్టాప్‌ పీరియడ్స్‌ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అని అదాశర్మ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఈమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube