ఆ సర్జరీ చేయించుకోవాలని నన్ను బలవంతపెట్టారు.. సమీరారెడ్డి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన వారిలో హీరోయిన్ సమీరా రెడ్డి( Heroine Sameera Reddy ) కూడా ఒకరు.ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

 Actress Sameera Reddy Reveals She Was Pressured By Film Industry To Get A Breast-TeluguStop.com

ఆ సినిమా అంతగా ఆడకపోయినా తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన జై చిరంజీవ సినిమాలో నటించింది.

Telugu Actresssameera, Sameera Reddy, Tollywood-Movie

ఈ సినిమాతో సమీరా రెడ్డి మంచు గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో అశోక్ ( Ashok )అనే సినిమా చేసింది.ఆ తర్వాత చాలా కాలం తర్వాత రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో( Krishnam Vande Jagadgurum ) స్పెషల్ సాంగ్ చేసింది.కాగా ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో ఎక్కువాగా కనిపించింది.

కాగా తమిళ్ లో సమీరా రెడ్డి నటించిన సూర్య సన్నాఫ్ కిషన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.ఇక 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లో కనిపించలేదు.

పెళ్లి చేసుకొని సెటిల్ అయిన సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Telugu Actresssameera, Sameera Reddy, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా సమీరా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అలాగే గతంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సమీరా రెడ్డి శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయి.ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని ఎమోషనల్ అయ్యింది.హీరోయిన్ గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయి.

ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు.చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు.

నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా వినేవారు కాదు.ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది సమీరా రెడ్డి.

నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను.కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది సమీర రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube