ఇజ్రాయెల్ – హమాస్( Israel – Hamas ) యుద్ధం అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల – వ్యతిరేక నిరసనలతో గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతోంది.
ముఖ్యంగా విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్సిటీలలో విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు.తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు( Kamala Harris ) నిరసన సెగ తగిలింది.
శనివారం రాత్రి డెట్రాయిట్ డెమొక్రటిక్ ఫండ్‌రైజర్ ఈవెంట్‌కు( Detroit Democratic fundraiser event ) కమలా హారిస్ ప్రసంగానికి ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులు అంతరాయం కలిగించారు.
మిచిగాన్ డెమొక్రటిక్ పార్టీ లెగసీ డిన్నర్‌లో భాగంగా గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఉద్దేశించి హారిస్ మాట్లాడుతుండగా.ప్రేక్షకుల గ్యాలరీలోంచి ఓ మహిళ ‘‘ ఇది మారణహోమం ’’ అంటూ పదే పదే కేకలు వేసింది.దీంతో షాక్‌కు గురైన కమల.కాసేపటికి తేరుకుని కౌంటర్ ఇచ్చింది.గత ఎనిమిది నెలలుగా అధ్యక్షుడు బైడెన్( President Biden ), తాను ఈ సంఘర్షణకు ముగింపు పలికేందుకు ప్రతిరోజూ పనిచేస్తున్నామని పేర్కొంది.
మీ గొంతుకు నేను విలువనిస్తాను.గౌరవిస్తాను, కానీ నన్ను ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటూ కమలా హారిస్ చెప్పింది.
ఆ వెంటనే భద్రతా సిబ్బంది మహిళను ఈడ్చుకెళ్లారు.ఈ యుద్దం ముగిసే సమయం వచ్చిందని కమలా హారిస్ తెలిపారు.
ఈ ప్రసంగం ద్వారా ఆమె ప్రేక్షకుల్లోని కొందరు పాలస్తీనా అనుకూలవాదులను శాంతింపజేశారు.
కాగా.గతేడాది ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం ప్రారంభమైన నాటి నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాల్లో నిరసనకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.మే 7న జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఓఎంఆర్ బిజినెస్ ఫెస్టివల్‌కు హాజరైన అమెరికన్ వ్యాపారవేత్త, సినీనటి కిమ్ కర్దాషియాన్ సైతం పాలస్తీనా అనుకూల నిరసనకారుడిని ఎదుర్కొన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇందులో పాలస్తీనా స్వేచ్ఛ కోసం నిరసనకారుడు నినాదాలు చేశాడు.ఆ సమయంలో హాలులో దాదాపు 7 వేల మంది ఉండగా.అతనిని భద్రతా సిబ్బంది లాక్కెళ్లారు.