టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో రామ్( ram ) ఒకరు.దేవదాస్( Devdas ) సినిమాతో రామ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి వైవీఎస్ చౌదరి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవదాస్ సినిమా రిలీజ్ రోజునే 10 కోట్ల రూపాయలు పోయాయని ఆయన అన్నారు.
నా ఆస్తులన్నీ స్టేక్ లోనే ఉన్నాయని నాలుగు వారాల వరకు ఆ సినిమాకు జనాలు లేరని వైవీఎస్ చౌదరి( YVS Chowdhary ) పేర్కొన్నారు.నేను మాత్రం జనాలు బ్రహ్మాండంగా వస్తున్నారని మైకుల్లో మాట్లాడానని ఆయన అన్నారు.
దేవదాస్ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా తక్కువకే అమ్మానని వైవీఎస్ చౌదరి వెల్లడించారు.జనవరి 11న దేవదాస్ రిలీజైందని జనవరి 12న స్టైల్ సినిమా రిలీజ్ కావడంతో నా సినిమా కుదేలైందని ఆయన తెలిపారు.
సంక్రాంతి సీజన్ లో లవ్ స్టోరీలు ప్రేక్షకులు చూడరని వైవీఎస్ చౌదరి వెల్లడించారు.13న చుక్కల్లో చంద్రుడు, లక్ష్మీ సినిమాలు రిలీజ్ కావడంతో నా సినిమాకు థియేటర్ల దగ్గర జనాలు లేరని ఆయన తెలిపారు.డబ్బులు పెట్టుకుని తిరిగితే నాలుగు వారాల తర్వాత సక్సెస్ దక్కిందని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.నందమూరి జానకి రామ్ కొడుకును హీరోగా వైవీఎస్ చౌదరి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.
రేయ్ సినిమా( Ray’s movie ) తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని వైవీఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.వైవీఎస్ చౌదర్ ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.వైవీఎస్ చౌదరికి ఈ సినిమాతో పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.