వైరల్ వీడియో: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న టీంఇండియా ఆటగాళ్లు..

నేడు జరగబోయే భారత్‌, పాకిస్థాన్‌( India and Pakistan ) ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్ ఆటగాళ్ళైనా సచిన్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్‌లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్‌ లో బేస్‌బాల్‌ ఆడుతూ కనిపించారు.ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ పాత ద్వారా షేర్ చేసింది.

 Viral Video: Team India Players Enjoying Playing Baseball In New York , T20 Wor-TeluguStop.com

ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ బేస్బాల్ బ్యాట్ తీసుకొని స్ట్రైక్ లో ఉండగా మరోవైపు ఎడమ చేతిలో కుడి చేతిలో బాల్ తీసుకొని బాలు వేయడానికి రవి శాస్త్రి ( Ravi sastri )రెడీగా ఉన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్( T20 World Cup ) లో టీమిండియా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించగా.పాకిస్థాన్ పరిస్థితి కాస్త ఘోరంగా ఉంది.పాకిస్తాన్ చివరగా జరిగిన మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 8 లో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది.

ఇక వైరల్ ( Viral )గా మారిన వీడియోలో రవి శాస్త్రి బౌలింగ్ చేస్తూ తన కామెంట్రీని చేసినట్లుగా మాట్లాడాడు.ఇందులో భాగంగా.బాల్ వేసే ముందు.“సిద్ధంగా ఉండండి.ఇది ఇప్పుడు నాట్ల రేటుతో వస్తోంది ” అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఆ తర్వాత రెండు బాల్స్ వేసిన శాస్త్రి చివరగా., “అయిపోయింది.

ఆట ముగిసిపోయింది” అంటూ మాట్లాడటంతో వీడియో ముగుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక నేడు న్యూయార్క్( New York ) వేదికగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube