ఈ హీరోల భార్యలను చేస్తున్న పనులను చూస్తే ముచ్చట వేయకుండా ఉండదు..!

భార్య అంటే భర్తలో సగం.కొన్నిసార్లు భర్తకు డబుల్.ఇది జనరల్ గా ప్రతి కుటుంబంలో ఉండేదే.సాధారణ కుటుంబంలోనే భార్యాభర్తల విషయంలో అన్యోన్యత లేదంటే బాధ్యతల విషయంలో ఎన్నో అభ్యంతరాలు వస్తుంటాయి భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి.

 South Indian Heros Wives Greatness ,namratha, Mahesh Babu , Shalini, Ajith, Saye-TeluguStop.com

అయినా కూడా సర్దుకుపోయే విధానం చూస్తే ఖచ్చితంగా ముచ్చట వేయకుండా ఉండదు.మరి ఒక్కసారి మన సౌత్ ఇండియాలోని కొంతమంది సెలబ్రిటీస్ లైఫ్ నీ చూస్తే ఫిదా అనిపిస్తుంది.

ఇక హీరో హీరోయిన్స్ గా చెలామణి అయి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఆ తర్వాత భర్త ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా కొనసాగుతుంటే భార్య మాత్రం ఇంటికి పరిమితమై తనవంతు బాధ్యతగా కుటుంబాన్ని చక్కగా నెరవేరుస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి.

Telugu Ajith, Amala, Mahesh Babu, Namratha, Sayesha, Shalini, Indian Heros, Indi

అలా మన సౌత్ సినిమా పరిశ్రమలో కొంతమంది స్టార్ హీరోలు తమ నిజజీవితంలో హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుని చక్కగా లైఫ్ నీ చేస్తున్నారు వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అయితే మామూలుగా పెళ్లి చేసుకుని జీవితాన్ని హ్యాపీగా లేట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.కానీ భర్త భార్య ఇద్దరు ఒకప్పుడు స్టార్ డం అనుభవించి ఆ తర్వాత భర్త స్టార్ హీరోగా కొనసాగుతూ భార్య ఇంటికి పరిమితం అయితేనే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం.

ఉదాహరణకు సౌత్ సినిమా పరిశ్రమలో మహేష్ బాబు( Mahesh babu ) నీ తీసుకుంటే ఆయన నమ్రతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో అయితే నమ్రత( Namratha ) కూడా ఎంతో చక్కగా ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత అలాగే తన భర్త బాధ్యత నెరవేరుస్తూ ఉత్తమ ఇల్లాలుగా కనిపిస్తుంది.

Telugu Ajith, Amala, Mahesh Babu, Namratha, Sayesha, Shalini, Indian Heros, Indi

నేను కూడా ఏమీ తక్కువ తినలేదు అన్నట్టుగా అజిత్ భార్య శాలిని ( Shalini )కూడా ఈ లిస్టులో ఉన్నారు.ఆమె కూడా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం కుటుంబ బాధ్యతను మాత్రమే చక్కగా నెరవేరుస్తున్నారు పిల్లల విషయంలో అలాగే భర్త విషయంలో కూడా ఆమె తన బాధ్యతలను విస్మరించకుండా పని చేయడం అక్కడ వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఆ మరొక సౌత్ హీరో ఆర్య కూడా హీరోయిన్ సాయేషా ( Sayesha )ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఆమె కూడా కూతురు పుట్టిన తర్వాత ఇంటికి పరిమితమైంది.ఇక పాత హీరోయిన్స్ అమలా( Amala ) జీవిత లాంటి వారు కూడా సినిమా జీవితాన్ని భర్తల కోసం త్యాగం చేశారు.

అలాగే కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నారు.మీరందరూ ఎన్నో చిత్రాలు నటించినప్పటికీ ప్రస్తుతం వారి ప్రపంచం ఇల్లు, పిల్లలు మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube