దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏన్డీయే కూటమి( NDA alliance ) అధికారంలోకి రావడం తెలిసిందే.బీజేపీకి 240 స్థానాలు రాగా మిగతా ఇతర పక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎన్డీఏ మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయు( TDP, JDU ) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడంలో కీలక పాత్ర పోషించాయి.దీంతో ఆదివారం మూడోసారి భారత్ ప్రధానమంత్రిగా మోదీ( Modi ) ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే సోమవారం పీఎంఓ లోని అధికారులతో మోదీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.
చాలామంది తన విజయ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారు.నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యం అని అన్నారు.
ఎవరిలో అయితే విద్యార్థుల లక్షణాలు ఉంటాయో వాళ్లు సక్సెస్ అవుతారని స్పష్టం చేశారు.నేను ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏమిటి అని కూడా అడుగుతుంటారు.నాలో ఎప్పుడూ ఓ విద్యార్థి ఉంటాడు.అదే నా సీక్రెట్.నేర్చుకునే తపన ఉండేవారు బద్దకాన్ని దరి చేరనీయరు, శక్తిని కోల్పోరు.ఆశయాలపై స్థిరత్వం ఉంటే అది కార్యరూపం దాలుస్తుంది.
దానికి శ్రమ తోడైతే విజయం వరిస్తుంది.ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పనిచేయాలని పేర్కొన్నారు.2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించండి.ఈ క్రమంలో అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
ప్రధాని కార్యాలయం సేవా కేంద్రంగా ఉండాలని పిఎమ్ఓ అధికారుల సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.