కల్కి సినిమాపై అంచనాలు పెంచేసిన అప్ డేట్.. మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ?

టాలీవుడ్ హీరో ప్రభాస్( Hero Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం క‌ల్కి 2898AD( Kalki 2898AD ).ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Kalki First Half Class, Kalki, Prabhas, Tollywood, Kalki Movie-TeluguStop.com

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ( Deepika Padukone )హీరోయిన్గా నటించింది.అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లాంటి స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ సినిమా జూన్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Telugu Kalki, Kalki Class, Prabhas, Tollywood-Movie

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, అప్డేట్లు ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచాయి.ఇప్పటికే విడుదల అయిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, బుజ్జి ఇవ‌న్నీ ఆక‌ట్టుకున్నాయి.

అలాగే తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.ప్రభాస్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా కల్కి సినిమా తొలి సగం క్లాస్ టచ్ తో వుంటుందని తెలుస్తోంది.మిగతా సగం మాస్ టచ్ తో ఉంటుందట.తొలిసగం అంతా కల్కి లోకంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తుంది.మిగిలిన సగం అంతా ఉర్రూత లూగిస్తుంది అని తెలుస్తోంది.

Telugu Kalki, Kalki Class, Prabhas, Tollywood-Movie

అదేవిధంగా కల్కి 2 కూడా ఉండబోతోంది అని తెలుస్తోంది.ఒకవేళ ఇదే కనుక నిజం అయితే కల్కి 2 పై ఇంకా అంచనాలు పెరుగుతాయి అని చెప్పవచ్చు.పైగా కమల్ పాత్ర కల్కి వన్ లో పరిచయం మాత్రమే.అసలు అంతా కల్కి 2 లోనే వుంటుంది.కల్కి సినిమా స్పెషల్ షో లకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.హైదరాబాద్ జంట నగరాల్లోని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే తెల్లవారుఝామన 1 గంటకు స్పెషల్ షో లు వుండే అవకాశం వుంది.

మల్టీ ఫ్లెక్స్ లో వుండకపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube