దెబ్బ అదుర్స్ కదూ.. పాక్ నడ్డివిడిచిన టీమిండియా..

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024( ICC T20 World Cup 2024 ) లో భాగంగా ఆదివారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది.పిచ్ అర్థం కాక బ్యాటర్లు ఇబ్బంది పెడుతున్న సమయంలో టీం ఇండియా బౌలర్లు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ను కట్టిడి చేసి మరోసారి అపురూపమైన విజయాన్ని అందించారు.

 Team India Beat Pakistan By 6 Runs , T20 World Cup 2024, India Vs Pakistan, Sp-TeluguStop.com
Telugu India Pakistan, Mohammad Rizwan, Pakistan, Rishabh Pant, Rohit Sharma, Cu

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది.ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ( Rishabh Pant )(31 బంతుల్లో 42 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.ఇక పాకిస్థాన్ బౌలింగ్ విషయానికొస్తే నసీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ రెండు వికెట్లతో టీమిండియాను తక్కువ స్కోరకే కట్టడి చేశారు.

Telugu India Pakistan, Mohammad Rizwan, Pakistan, Rishabh Pant, Rohit Sharma, Cu

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 113 పరుగులు మాత్రమే చేసింది.టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు, హార్దిక్ పాండ్య రెండు, అర్షదీప్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.మహ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan ) (44 బంతుల్లో 31 పరుగులు) తో పోరాడాడు.

ఇకపోతే మొదట్లో లక్ష్య ఛేదనను పాకిస్థాన్ కాస్త దూకుడుగా ఆరంభించింది.అర్షదీప్ వేసిన మొదటి ఓవర్‌లో తొమ్మిది పరుగులు సాధించింది.

ఆ తర్వాత సిరాజ్‌ను బాబర్ అజామ్ బౌండరీ తో స్వాగతం పలకగా.ఆ తర్వాత.

, బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్థాన్ స్కోరు వేగం కాస్త నెమ్మదించింది.ఇదే ఫ్లోలో 5వ ఓవర్‌ లో కెప్టెన్ బాబర్‌ ను బుమ్రా బోల్తాకొట్టించాడు.

ఇక 10 ఓవర్ల సమయానికి 57/1తో పాకిస్తాన్ నిలిచింది.చేతిలో 9 వికెట్లు ఉండటంతో పాకిస్థాన్ ఫేవరేట్‌ గానే అనిపించిన.

డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ తొలి బంతికే ఉస్మాన్‌ ను ఔట్ చేశాడు.దీంతో మ్యాచ్ మలుపు తిరగడంతో చివరికి ఆరు పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా పాకిస్తాన్ ను ప్రపంచ కప్ చరిత్రలో మరోసారి ఓడించింది.

నీతో ప్రపంచ కప్పు లో వేట మొత్తం తొమ్మిది మ్యాచ్లలో 8 – 1 విజయాలతో టీమ్ ఇండియా తన డామినేషన్ చూపిస్తుంది.ఈ మ్యాచ్లో జస్ప్రిత్ బూమ్రా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube