తమిళంలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న శంకర్ (Shankar)ప్రస్తుతం కమలహాసన్(Kamala Haasan) ను హీరోగా పెట్టి భారతీయుడు 2 అనే సినిమాని తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని సినిమా యూనిట్ శరవేగంగా నిర్వహిస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
అయితే ఈ సినిమాలోని పాటలు ప్రస్తుతం ప్రేక్షకులు ఆకట్టుకోవడం లేదంటూ చాలా మంది సోషల్ మీడియా వేదిక వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఒకప్పుడు వచ్చిన భారతీయుడు సినిమా సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి.ఇక ఆ సినిమా సక్సెస్ లో సాంగ్స్ కూడా చాలా వరకు కీలకపాత్ర వహించాయని చాలామంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) మ్యూజిక్ డైరెక్టర్ గా శంకర్(Shankar) తీసుకోవడం చాలా పెద్ద మైనస్ గా మారిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఒకప్పుడు భారతీయుడు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిన మ్యూజిక్ ఇప్పుడు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతుందంటూ చాలా మంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడం లేదు.మరి ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది సినిమా రిలీజ్ అయితే గాని తెలియదు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది.ఇక మొత్తానికైతే కమలహాసన్ సక్సెస్ కొడతాడా లేదా అనేది తెలియాలంటే జూలై 12 వరకు వెయిట్ చేయాల్సిందే.