టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన మూవీ ఆదిపురుష్.( Adipurush ) ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటి నుంచి వరుసగా ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూ వచ్చాయి.మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్రల వేషధారణలపై ఎన్నో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే.
మూవీ మేకర్స్ అందరిపై నెటిజన్స్ మండి పడ్డారు.ఆ సంగతి పక్కన పెడితే.

రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా( Dipika Chikhlia ) తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ.ఈ చిత్రంలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.ఆదిపురుష్ మూవీని చూసిన పిల్లలు రామాయణం( Ramayanam ) అంటే ఇలానే ఉంటుందేమోనని భావిస్తారు.అలా అనుకుంటే భవిష్యత్తుకే ప్రమాదకరం.ఆ విషయం తలచుకుంటే బాధేస్తుంది.
ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు( Ravana ) ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు.దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు.

రావణుడు గొప్ప శివభక్తుడు.ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి.ఆయన జీవితంలో చేసిన ఒకేఒక్క తప్పు సీతను అపహరించడమే.ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు.అంత గొప్ప వ్యక్తిని ఆదిపురుష్ లో రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం అన్నది నన్ను చాలా బాధించింది.నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు.
టీవీలో కొంతభాగం చూసే సరికే తట్టుకోలేకపోయాను.సీతాదేవిని గులాబీరంగు చీరలో చూపడం, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం నాకు ఏమాత్రం నచ్చలేదు.
సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసారు.







