నా ఫీలింగ్స్ కి విలువలేదు.. నవ్వులాటగా ఉంది.. మరోసారి ఫైర్ అయిన రేణు దేశాయ్!

రేణు దేశాయ్ ( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటి నుంచి ఈమె పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ గెలవడంతో తన కుమారుడు అకీరా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉండడంతో వీరికి సంబంధించిన ఫోటోలను కూడా ఈమె షేర్ చేస్తున్నారు.

 Renudesai Once Again Fire On Pawan Kalyan Fans , Renu Desai, Pawan Kalyan ,ak-TeluguStop.com
Telugu Akira, Lezhinova, Pawan Kalyan, Renu Desai, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత తన కొడుకు అలాగే మూడో భార్య అన్నా లెజీనోవాతో కలిసి చంద్రబాబు నాయుడుతో పాటు నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే.అయితే నరేంద్ర మోడీతో తన కుమారుడి దిగిన ఫోటోలలో పవన్ మూడో భార్యను కట్ చేసి తన కొడుకు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫోటోలను ఈమె షేర్ చేసారు.అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన రేణు దేశాయ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినప్పటికీ చాలామంది పర్సనల్ గా తనకు కామెంట్లు చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులపై మండిపడ్డారు.

Telugu Akira, Lezhinova, Pawan Kalyan, Renu Desai, Tollywood-Movie

ఈ సందర్భంగా రేణు దేశాయ్ స్పందిస్తూ.నా బాధ వాళ్లకు నవ్వులాటగా మారింది.తన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ లేదని.

ఎందుకంటే తాను రోబో అంటూ  తన ఇన్ స్టా స్టోరీలో కామెంట్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.నాకు జరిగినట్టుగా వాళ్లకి జరిగితేనే ఆ బాధ అర్థం అవుతుందని ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తారని నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనని ఇబ్బందులకు గురి చేస్తూ నాపై కామెడీలు చేస్తున్నారంటూ ఈమె మండిపడ్డారు.

ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ కోప్పడడం ఇది మొదటిసారి కాదు.ఇప్పటికే ఎన్నోసార్లు అభిమానులతో ఈమె సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వివాదాలు ఎదుర్కొన్నారని చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube