ప్రతిరోజు సోషల్ మీడియా( Social media)లో వందల సంఖ్యలో వీడియోలు చూస్తూనే ఉంటాం.ఇందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండడం చూస్తూ ఉంటాం.
అప్పుడప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు లేకపోతే ఎవరైనా రోడ్డుపై స్టెంట్స్ చేస్తున్న వీడియోలు కూడా గమనించే ఉంటాం.ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ ఇలాంటి ఓ వీడియోని షేర్ చేస్తూ యువతకు మెసేజ్ అందించారు.ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో ఓ యువకుడు రోడ్డుపై చేస్తున్న స్టంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇకపోతే ఈ వీడియోలో ఓ యువకుడు స్కూటర్ పై నడుపుతూ తాను స్కూటర్ ముందర హ్యాండిల్ చేతులు వదిలేసి రోడ్డుపై స్టంట్స్ చేశాడు.రోడ్డు మీద అలా వెళ్తున్న సమయంలో తన స్నేహితులు వెనకాల నుండి వీడియో తీస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డుపై వారికి మరో స్కూటర్ అడ్డు రావడంతో స్కూటర్ ను అదుపు చేసేందుకు చిన్నగా పోనిద్దామని కిందికి దిగే ప్రయత్నంలో ఒక్కసారిగా ఆ అబ్బాయి స్కూటర్ పైనుంచి దూరంగా ఉన్న కాల్వకు తగలడంతో ప్రమాదం జరిగింది.దానితో అతడు హాస్పిటల్ పాలయ్యాడు.
సజ్జనార్( Sanjanar ) ఈ వీడియోను షేర్ చేస్తూ.ఇలాంటివి చేస్తూ మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటూ యువతకు పిలుపునిచ్చారు.నిజానికి ఇలా చేయడం ద్వారా పిల్లలు వారి తల్లిదండ్రుల కడుపుకోతకు గురి చేస్తున్నారు.చూడాలి మరి యువత ఈ వీడియో వల్ల కొందరైనా మారుతారో లేదో.