వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం పై పూనమ్ షాకింగ్ ట్వీట్!

సినీ ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా సక్సెస్ అందుకోవడం కంటే కూడా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తలలో నిలిచిన వారిలో నటి పూనమ్ కౌర్( Poonam kaur ) ఒకరు.ఈమె ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేస్తారో ఎవరికి తెలియదు అలాగే ఈమె చేసే పోస్టులు కూడా పరోక్షంగా కొందరిని ఉద్దేశిస్తూ చేయడంతో ఆమె ఎవరి గురించి చేశారనే విషయంపై కూడా అందరిలోనూ సందేహాలు కలుగుతూ ఉంటాయి.

 Poonan Kaur Interesting Comments On Ys Jagan Mohan Reddy Family ,ys Jagan Mohan-TeluguStop.com

గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) పరిపాలన గురించి ఎంతో అద్భుతంగా ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేసిన ఈమె ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఓటమి గురించి కూడా పోస్ట్ చేశారు.

Telugu Poonam Kaur, Poonankaur, Sharmila, Ys, Ysjagan-Movie

వైయస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగారు.అయితే ఈయన మాత్రం ఎన్నికల ఫలితాలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు.ఈ క్రమంలోనే పూనమ్  పోస్ట్ చేస్తూ…వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారుని ట్వీట్ చేసింది.

దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది.పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.అసలు పూనమ్ ఎవరిని ఉద్దేశించి పూనమ్ ఈ కామెంట్స్ చేశారన్నది అర్థం కాలేదు అయితే తాజాగా మరోసారి వైయస్ జగన్ ఫ్యామిలీ గురించి ఈమె పోస్ట్ చేశారు.

Telugu Poonam Kaur, Poonankaur, Sharmila, Ys, Ysjagan-Movie

గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలుపొందారు ఈ విజయంలో తన తల్లి విజయమ్మతో పాటు తన భార్య భారతి అలాగే తన సోదరీ షర్మిల కృషి కూడా ఎంతో ఉంది కానీ ఈసారి ఎన్నికలలో భాగంగా జగన్ ఒంటరిగా పోటీకి దిగారు.దీంతో వైయస్ కుటుంబం( YS Family ) గురించి ఈమె పోస్ట్ చేస్తూ గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర.వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు.

ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube