సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జగపతిబాబు ( Jagapathi Babu ) ఒకరు .ఈయన కెరియర్ మొదట్లో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఈయనకు సినిమా అవకాశాలు రాకపోవడం అనంతరం ఆయన ఆస్తులన్నీ కూడా కరిగిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ పలు సందర్భాలలో తెలిపారు.అయితే ఈయన ఆస్తులన్నీ ఇలా కరిగిపోవడానికి గల కారణమేంటనే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఆస్తులు పోగొట్టుకోవడానికి హీరోయిన్లకు గిఫ్టులు( Gifts ) ఇవ్వడమే కారణమా అనే ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నకు జగపతిబాబు సమాధానం చెబుతూ తాను ఆస్తి ( Assets ) పోగొట్టుకోవడానికి ఇది ఒకటే ప్రధాన కారణం కాదని తెలిపారు.నాకు జూదం ఆడే అలవాటు ఉంది.జూదం ఆడి రెండు కోట్ల వరకు పోగొట్టుకున్నాను.ఇక నేను హీరోయిన్ల వెంట పార్టీలకు వెళ్లిన లేదా షాపింగ్ వెళ్ళిన ఆ ఖర్చు మొత్తం తానే పే చేస్తాను కేవలం హీరోయిన్ల గురించి మాత్రమే కాదు అలాగే హీరోలతో వెళ్లిన పార్టీలకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను తద్వారా ఆస్తులు పోగొట్టుకున్నానని తెలిపారు.

ఇక నేను సినిమాలలో నష్టపోతే నిర్మాతలకు డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.అంతే కాకుండా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను.ఈ ఇంటికి తీసుకున్న అప్పు కోసం సుమారు 20 కోట్ల వరకు వడ్డీ చెల్లించానని ఇవన్నీ కూడా నేను ఆస్తులు కోల్పోవడానికి ప్రధాన కారణాలు అంటూ జగపతిబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఈయన విలన్ పాత్రలలో వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవ్వడమే కాకుండా ఆస్తులు కూడా భారీ స్థాయిలో సంపాదించారు.







