టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ( Anasuya ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగడమే కాకుండా మరోవైపు వరుసగా వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇలా అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరం అవుతూ కేవలం వెండి తెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉంటున్నారు.
ఇదిలా ఉండగా త్వరలోనే అనసూయ తిరిగి బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.జబర్దస్త్ (Jabardasth )కార్యక్రమం ద్వారా సక్సెస్ అయిన ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారు.ఇక ఈ షో ఈటీవీలో ప్రసారమవుతూ ఉండేది.ఇక త్వరలోనే స్టార్ మా లో సరికొత్త కార్యక్రమం ప్రసారం కాబోతోంది.కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ( Kirak Boys Khiladi Ladies ) పేరుతో షో ప్రారంభం కాబోతోంది ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ షోస్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఆమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసింది.ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ని ఇన్‌స్టా, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే విడుదల కాబోయే పుష్ప 2 ( Pushpa 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.