నేను సినిమాలలో వాటా తీసుకుంటాను... కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగుతూ వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) ఒకరు.ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Kiran Abbavaram Take Profit On Movie Collections As Like Star Heroes , Kiran Abb-TeluguStop.com

ఇక ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన పరవాలేదు అనిపించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ అబ్బవరం అశు రెడ్డి( Ashu Reddy ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి దావత్ ( Dawath ) అనే కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.

Telugu Ashu Reddy, Kiran Abbavaram, Profits, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా సినిమాలలో లాభాలలో వాటాలు తీసుకుంటూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే .అయితే ఇలా స్టార్ హీరోలు మాత్రమే వాటాలు తీసుకుంటూ ఉంటారు.కిరణ్ అబ్బవరం సైతం సినిమా లాభాలలో వాటాలు తీసుకుంటారంటూ కూడా ఒక వార్త వైరల్ గా మారింది.

అయితే ఈ వార్తపై తాజాగా కిరణ్ అబ్బవరం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నేను రెండు మూడు సినిమాలకు మినహా మిగిలిన అన్ని సినిమాలకు కూడా సినిమా విడుదలై లాభాలు వచ్చిన తర్వాతనే రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నాను అని తెలిపారు.

Telugu Ashu Reddy, Kiran Abbavaram, Profits, Tollywood-Movie

సినిమాకు కమిట్ అయ్యి సినిమా ప్రారంభానికి ముందే రెమ్యూనరేషన్ తీసుకొని ఆ హీరో సినిమా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే పూర్తిగా ఆ నష్టాన్ని నిర్మాత భరించాల్సి ఉంటుంది అందుకే తాను ముందుగా రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలైన తర్వాత బాగా లాభాలు వస్తేనే అందులో తన రెమ్యూనరేషన్ తీసుకుంటానని తెలియజేశారు.ఒకవేళ నిర్మాతకు నష్టం వస్తే పెద్దగా డబ్బును కూడా నేను డిమాండ్ చేయను అంటూ ఈయన తెలియజేశారుగా.ఇలా కిరణ్ అబ్బవరం చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో చిన్న హీరో అయినా నిర్మాతల పట్ల పెద్ద మనసుతో ఆలోచించారు అంటూ ప్రశంసల కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube