ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un ) గురించి చాలామందికి తెలుసు.ఎన్నో వివాదాస్పదమైన చర్యల్లో కిమ్ పేరు వినబడుతూ ఉంటుంది.
ఆ దేశ ప్రజలే మనోడికి హడలి పోతుంటారు.అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అక్కడ ప్రవేశపెడతారు.
ఈ క్రమంలోనే కిమ్ మరోసారి తెరపైకి వచ్చారు.త్వరలో రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమ గూఢచర్య ఉపగ్రహాన్ని తాజాగా పరిశీలించారు.
ఓ ఏరోస్పేస్ కేంద్రంలో ఉన్న ఆ స్పై శాటిలైట్ ను అధినేత కిమ్ జాంగ్ ఉన్ సందర్శించారని ఉత్తర కొరియా( North Korea ) ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ తాజాగా వెల్లడించింది.
దాంతో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది.ఈ సందర్భంగా కిమ్ వెంట ఆయన కుమార్తె కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.ఈ గూఢచర్య ఉపగ్రహాన్ని( spy satellite ) ప్రయోగించేందుకు కిమ్ ఆమోదం తెలిపారని, ఉత్తర కొరియా నిఘా సామర్థ్యాన్ని ఇనుమడింపజేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారని అక్కడి స్థానిక మీడియాలలోని సారాంశం.
కాగా, దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించడం కొసమెరుపు.బాలిస్టిక్ మిస్సైళ్లను( Ballistic missiles ) ప్రయోగించడానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాలు చేపడుతోందని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ఓ మీడియా వేదికగా చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన ఆ ప్రతినిధి ఉత్తర కొరియా మరోసారి ఐక్యరాజ్యసమితి తీర్మానాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు.దీనిపైన కొందరు నిపుణులు మాట్లాడుతూ తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.