చూసేందుకు సపోటా పండు మాదిరిగా ఉండే కివి పండులో యాపిల్ కంటే ఎక్కువగా పోషకాలు నిండి ఉంటాయి.అందుకే కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అనేక జబ్బులను నివారిస్తుందని నిపుణులు చెబుతుంటారు.
ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే కివి పండ్లు మన దేశంలో పండక పోయినా.ఇక్కడ మార్కెట్లలో విరి విరిగా లభ్యమవుతాయి.
ఈ పండును కొందరు డైరెక్ట్‌గా తింటే.కొందరు సలాడ్స్ రూపంలో తీసుకుంటారు.
మరికొందరు జ్యూస్ చేసుకుని సేవిస్తుంటారు.ఇలా ఎలా తీసుకున్నా కివిలో ఉండే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
అయితే కివి పండు ఆరోగ్యానికి ఎంత మంచి చేసినప్పటికీ.కొందరు మాత్రం వాటికి దూరంగా ఉండాల్సిందే.మరి ఆ కొందరు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కిడ్నీ రోగులు కివి పండును ఎంత ఎవైడ్ చేస్తే అంత మంచిది.
సాధారణంగా కిడ్నీ రోగులను ఆహారంలో పొటాషియం తక్కువ ఉండేలా చూసుకోమని వైద్యులు చెబుతుంటారు.కానీ, కివి పండ్లలో పొటాషయం కంటెంట్ అధికంగా ఉంటుంది.
కాబట్టి, వీటిని తీసుకుంటే కిడ్నీ వ్యాధులు మరింత ముదిరిపోతాయి.
గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడే వారు కూడా కివి పండ్లను తినకపోవడమే మంచిది.ఎందుకంటే, కివి పండ్లలో అధికంగా ఉండే యాసిడ్ కంటెంట్ జీర్ణ సమస్యలను రెట్టింపు చేస్తాయి.
అలాగే గర్భిణీ స్త్రీలు రోజుకు రెండిటికి మించి కివి పండ్లను తీసుకోవడం చాలా డేంజర్.పరిమితి మించి వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో గొంతు నొప్పి, కడుపు నొప్పి, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇక కివి పండ్లు ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలను అందించినప్పటికీ.
వీటిని ఓవర్ గా తీసుకుంటే మాత్రం వాంతులు, విరేచనాల, మైకం, చర్మంపై దద్దుర్లు, పెదవులు, నాలుక వాయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.