నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది.పాలిటెక్నిక్ గ్రౌండ్స్‌లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
కారులో వచ్చిన దుండగులు వ్యక్తిని చితకబాది తీసుకుని వెళ్లారు.నిందితులు TS 29 C 6688 కారులో వచ్చినట్లు తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు.అదేవిధంగా కిడ్నాపైన వ్యక్తి గురించి వివరాలు సేకరిస్తున్నారు.