హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్( Kiccha Sudeep ) గురించి మనందరికీ తెలిసిందే.కిచ్చా సుదీప్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Kichcha Sudeep On Retirement And Rejection Of Films, Kichcha Sudeep, Retirement,-TeluguStop.com

కాగా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.

ఆ తర్వాత చాలా సినిమాలలో నటించారు.ఆయన నటించిన కన్నడ సినిమాలు కూడా తెలుగులో విడుదల అయ్యాయి.2003లో వచ్చిన కిచ్చా సినిమా ఆయన ఇంటిపేరుగా మారిపోయిన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నా కిచ్చా సుదీప్ ఇటీవల మాక్స్ మూవీతో( Max Movie ) ప్రేక్షకులను పలకరించారు.

Telugu Kichcha Sudeep, Kollywood-Movie

ఈ మూవీ థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ సందర్బంగా సుదీప్ మాట్లాడుతూ.నేను ఇంకా అలిసిపోలేదు.కానీ ఎదో ఒక సమయంలో పక్కా రిటైర్ అవుతాను.ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్‌ కొట్టేస్తాడు.

అందరికీ ఒక టైమ్‌ అనేది ఉంటుంది.ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్‌ చేయించలేదు.

భవిష్యత్తులో సపోర్టింగ్‌ రోల్‌లో చేస్తే.ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను.

సోదరుడు, మామయ్య వంటి పాత్రలు చేయడానికి నాకు ఆసక్తి లేదు అని అన్నారు.

Telugu Kichcha Sudeep, Kollywood-Movie

అనంతరం తాను రిజెక్ట్‌ సినిమాల గురించి మాట్లాడుతూ.అవి కథలు నచ్చకపోవడం వల్ల రిజెక్ట్‌ చేయలేదు.ఈ సమయంలో వాటిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదని వాటిని అంగీకరించలేదు.

నటనకు విరామం తీసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదు.ఒకవేళ ప్రధాన పాత్ర అవకాశాలు రాకపోతే దర్శకత్వం, ప్రొడక్షన్‌ వైపు వెళ్తాను.

నేను హీరోగా ఇప్పటివరకు సాధించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉన్నన్ని చెప్పారు.ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube