ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఒకప్పుడు టాలీవుడ్ లో సీక్వెల్స్ తెరకెక్కిస్తే ఫ్లాప్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొనగా ప్రస్తుతం ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది.
గతేడాది డిసెంబర్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదలైన పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ నెల 17వ తేదీ నుంచి పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన అదనపు నిడివితో ఉన్న మూవీ ప్రదర్శితం కానుంది.3 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్లలో పుష్ప ది రూల్ మూవీ ప్రసారం కానుంది.అయితే అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలు సినిమాకు ప్లస్ అవుతాయేమో చూడాల్సి ఉంది.అయితే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప2( Pushpa 2 ) కేజీఎఫ్2( KGF 2 ) రెండు రికార్డ్స్ ను బ్రేక్ చేయలేకపోయింది.
కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం కేజీఎఫ్2 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించగా పుష్ప2 కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ రికార్డును అందుకోలేకపోయింది.పుష్ప ది రూల్ ఖాతాలో ఈ రికార్డ్ చేరకపోవడం ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది.వాస్తవానికి బన్నీకి మలయాళంలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే పుష్ప2 మాత్రం మలయాళ ప్రేక్షకులకు నచ్చలేదు.బన్నీ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
అల్లు అర్జున్( Allu Arjun ) క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.పుష్ప2 సీక్వెల్ పుష్ప3( Pushpa 3 ) కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందేమో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఈ హీరో కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.