రాజకీయాల్లో కేసీఆర్ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు.తెలంగాణ సాధించే క్రమంలో రాజకీయంగా చాలా రకాల అడ్డంకులను ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు అదే తరహా పరిస్థితులను మరొక సారి ఎదుర్కొంటున్నట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మనకు అనిపిస్తోంది.
అయితే ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి రావడంతో మరొక్క సారి కేసీఆర్ అధికారంలోకి వస్తే ఇక ప్రతిపక్షాలు మరింత బలహీనంగా మారే అవకాశం వందకు వంద శాతం ఉంది.ఎందుకంటే ఈ మూడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు ఏయే విషయాలపై ఆగ్రహంగా ఉన్నారో ఆ విషయాలపై ముఖ్యంగా కేసీఆర్ దృష్టి పెట్టె అవకాశం ఉంది.
అయితే తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో రాజకీయ వాతావరణం తెలంగాణ ప్రజలు మునుపెన్నడూ లేనంత రీతిలో ఉండే అవకాశం ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇక ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఇక మరో సారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆ తరహా నిరసనలకు రానున్న రోజుల్లో పిలుపునిచ్చే అవకాశం ఉంది.
తద్వారా తెలంగాణ సమస్య రాష్ట్ర వ్యాప్త సమస్య లా కాక దేశ వ్యాప్త సమస్య గా మారే అవకాశం ఉంది.తద్వారా రాష్ట్ర బీజేపీ విమర్శలు ఏవీ ప్రజల్లోకి వెళ్ళవు సరికదా కేసీఆర్ కార్యాచరణ పైనే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది.
దీంతో ప్రజల దృష్టి బీజేపీ పై కాక టీఆర్ఎస్ పై ఉండి గెలుపొందడానికి ఉన్న అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది.అయితే ఈ తరహా వ్యూహం ప్రయోగించడం అంత సులభం కానప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే చాలా సులభం అని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.