తెలంగాణలో టీడీపీ ఒంటరి పోరు ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( TDP ) పోటీ చేయాలని డిసైడ్ అయిపోయింది.ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టారు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.

 Kasani Gnaneshwar Clarity On Tdp Party Contesting In Telangana Elections Details-TeluguStop.com

( Kasani Gnaneshwar ) ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu Naidu ) అనుమతి నిరాకరిస్తే పార్టీ మారేందుకు కూడా జ్ఞానేశ్వర్ సిద్దమన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.  నిన్న చంద్రబాబుతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ములాకత్ అయిన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయం పై  చంద్రబాబుతో చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ పోటీకి అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో , తెలంగాణ లో టీడీపీ పోటీ చేస్తుంది అని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కూడా తెలంగాణ ఎన్నికలపై హైదరాబాదులో మాట్లాడుతారని  కాసాని తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో టిడిపి పొత్తులతో పోటీ చేస్తుందా లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయంలో ఆ పార్టీ నేతలకు ఏ క్లారిటీ రావడం లేదు.

Telugu Chandrababu, Congress, Janasena, Lokesh, Pavan Kalyan, Telangana Tdp, Ttd

టిడిపి తో పాటు జనసేన ను( Janasena ) ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే విధంగా చేసేందుకు బిజెపి( BJP ) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో అనే అనుమానాలు ఉన్నాయి.  ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నారు.అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జనసేన పైన ఒత్తిడి చేస్తున్నారు.

టిడిపి విషయంలోనూ అదే రకమైన ఒత్తిడి కనిపిస్తోంది.అయితే టిడిపి నేతలు మాత్రం ఈ విషయంలో టిడిపి ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో( Telangana Elections ) ఒంటరిగా పోటీ చేసేందుకు తెలంగాణ టిడిపి సిద్దమయింది.ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు.

Telugu Chandrababu, Congress, Janasena, Lokesh, Pavan Kalyan, Telangana Tdp, Ttd

అలాగే టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.చంద్రబాబు అనుమతి కోసం ఇప్పటి వరకు జ్ఞానేశ్వర్ ఎదురు చూసారు.చంద్రబాబు నుంచి అనుమతి లభించడంతో ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించిన ఏర్పాట్లలో జ్ఞానేశ్వర్ నిమగ్నం  కాబోతున్నారు.ఒకవేళ బీజేపీతో పొత్తుకు ప్రయత్నించినా,  ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో,  పొత్తు అవకాశం లేదని , ఒంటరిగానే ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని తెలంగాణ టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా ఈరోజు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube