ఈమధ్య కాలంలో కొందరు లేనిపోని అనుమానాలు మరియు భయం కారణంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఈక్రమంలో ఇతరుల ప్రాణాలు కూడా తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.
కాదా తాజాగా ఓ వైద్యుడు ఒమిక్రాన్ వైరస్ కి భయపడి లేనిపోని అనుమానాలు తో తన భార్య పిల్లలను దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
దీంతో సుశీల్ కుమార్ స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు.అయితే మంచి ఉద్యోగం భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో కరోనా వైరస్ కారణంగా జీవితంలో కలహాలు ఏర్పడ్డాయి.
దీంతో అప్పటి వరకూ ఎంతో సంతోషంగా గడిపిన డాక్టర్ సుశీల్ కుమార్ ఈ మానసిక రుగ్మతలతో బాధపడ్డాడు.దీనికితోడు ఇటీవలే ఒమిక్రాన్ అనే కొత్త వైరస్ గత కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తున్న డంతో డాక్టర్ సుశీల్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్క సారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
కాగా ఇటీవలే డాక్టర్ సుశీల్ కుమార్ ఒమిక్రాన్ వైరస్ చాలా ప్రమాదకరమని ఒకవేళ ఈ వైరస్ కనుక చూపిస్తే తన భార్యా పిల్లలను కాపాడుకోవడం కష్టతరమవుతుందని లేనిపోని భయాలు పెంచుకున్నాడు.
దీంతో తాజాగా డాక్టర్ సుశీల్ కుమార్ తన భార్య మరియు కొడుకు కూతురు ని దారుణంగా గొంతు కోసి హతమార్చాడు.ఇది గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.కానీ పోలీసులు వచ్చే సమయానికి డాక్టర్ సుశీల్ కుమార్ అక్కడి నుండి పరారయ్యాడు.
కానీ సుశీల్ కుమార్ డైరీ ని పరిశీలించిన పోలీసులు అతడి డైరీని కనుగొన్నారు అయితే ఇందులో గతకొద్దిరోజులుగా తనకు ఒమిక్రాన్ వైరస్ గురించి అధ్యయనం చేస్తున్నానని ఒకవేళ ఈ వైరస్ తన భార్య పిల్లలకు సోకితే వాళ్ళని బ్రతికించడం కష్టమవుతుందని అందువల్లనే బ్రతికుండగానే వారిని హత మార్చినట్లు డైరీలో రాసినట్లు పోలీసులు గుర్తించారు.అలాగే నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.