ఈ మద్య అడవిలో ఉండాల్సిన జంతువులు మనకు ఊర్లలో కనిపిస్తున్నాయి.అయితే అవి ఎందుకు ఇలా స్తున్నాయో అర్థం కావట్లేదు గానీ ఇందుకు ఒక్క కారణం అని మాత్రం చెప్పలేం.
ఎందుకంటే చాలా రకాల కారణాలు దీనికి ఉన్నాయి.ప్రధానంగా మాత్రం మనుషులు కావాలని చేసిన తప్పిదం వల్లే అడవులు నాశనం అయ్యి చివరకు అక్కడ ఉండే జంతువులకు ఎలాంటి ఆధారం లేకపోవడతో అవి కాస్తా ఊరల్ మీదకు వస్తున్నాయి.
ఇక అవి ఊర్ల మీదకు వచ్చినప్పుడల్లా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
అయినాక కూడా మానవులు మాత్రం అడవులను నరకి వేస్తూనే ఇంకా విస్తీర్ణం తగ్గిస్తున్నారు.
కనీసం అందులో ఉండే జంతువుల సంరక్షణ గానీ వాటి జీవన మనుగడ గురించి గానీ ఆలోచించకుండా ఇలాంటి పనులు చేయడంతో అవి కాస్తా జనావాసాల్లోకి వస్తున్నాయి.ఇఆ అవి జనావాసాల్లోకి వచ్చినప్పుడల్లా మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి.
ఇప్పటికే క్రూర మృగాలు ఇలా వచ్చి ప్రాణాలు కూడా తీస్తున్నాయి.ఇక ఇప్పుడు కూడా ఓ అడవి జంతువు జనావాసల్లోకి వచ్చి చేసిన పని గురించి తెలుసుకుందాం.
మన ఈ వీడియో చూస్తుంటే ఇందులో కొంతమంది యువతులు రోడ్డుపై ఎంచక్కా సైక్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇలా వారు వెళ్తున్న క్రమంలో ఒక అమ్మాయి అందరికంటే ముందు వెళ్తుండటంతో సడెన్ గా పక్కనే ఉన్న అడవి నుంచి ఓ కంగారూ రోడ్డు దాటేందుకు గెంటుకుంటూ వస్తోంది.ఇక అప్పుడే ఆ ముందు వెళ్తున్న అమ్మాయి కూడా దానికి అడ్డంగా రావడంతో ఆ కంగారు ఆమెను ఢీ కొట్టింది.ఇంకేముంది ఆ అమ్మాయి కింద పడిపోతుంది.
కాగా ఇదంతా వెనుకాల వస్తున్న వారు వీడియో తీసి నెట్టింట్లో వదలగా అది కాస్తా వైరల్ అయిపోయింది.
.