జాతీయ భాషగా హిందీ వద్దు... ఆ భాషను జాతీయ భాష చేద్దాం... కంగనా కామెంట్స్ వైరల్!

కన్నడ హీరో సుదీప్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మధ్య జాతీయ భాష హిందీ గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే.

సుదీప్ జాతీయ భాష హిందీ కాదంటూ చేసిన వ్యాఖ్యలను అజయ్ దేవగన్ తీవ్రంగా ఖండించారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరోక్షంగా ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది.ఇలా వీరి మధ్య చెలరేగిన ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ జాతీయభాష వివాదంలోకి కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ ఎంట్రీ ఇచ్చారు.ఏ విషయంలో అయినా ఈమె ఎంట్రీ ఇస్తే ఇక ఆ విషయం మరింత వివాదాస్పదంగా మారుతుందనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే జాతీయ భాష గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందీ జాతీయ భాష ఏంటని ప్రశ్నించారు.

Advertisement

ఈ విషయంపై కాస్త భిన్నంగా స్పందించిన కంగనారనౌత్ హిందీ జాతీయ భాష కాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కన్నడ, హిందీ, గుజరాతి భాషల కన్నా సంస్కృతం ఎంతో పురాతనమైన భాష.పైగా భారతీయ భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చాయని ఈమె తెలియజేశారు.అందుకే మన జాతీయ భాషగా సంస్కృతం కంటే మరేది జాతీయ భాషగా ఉండటం సరైన విషయం కాదని కంగనా రనౌత్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరి ఈ విషయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు