17 రోజుల్లోనే రికార్డులను తిరగరాసిన విక్రమ్.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

 Kamal Hasan Vikram Box Office Collections In 17 Days Details, Kamal Haasan, Vikr-TeluguStop.com

అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.అందుకే ఈయనకు ఒక హిట్ చాలా అవసరం అయ్యింది.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈయనకు హిట్ వచ్చినా చాలు అనుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.

వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Telugu Fahadh Fasil, Kamal Haasan, Vikram-Movie

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో హిట్ మూవీగా డిసైడ్ చేసేసారు.సొంత బ్యానర్ లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.అందుకే కమల్ చాలా సంతోషంగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంకా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

Telugu Fahadh Fasil, Kamal Haasan, Vikram-Movie

ఇక ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది.అందుకే ఇంకా సాలిడ్ వసూళ్లు రాబడుతూ అన్ని రికార్డులను తిరగరాస్తుంది.ఈ సినిమా 17 రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.

విక్రమ్ సినిమా 17 రోజుల్లో 370 కోట్ల గ్రాస్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.తమిళ్ ఇండస్ట్రీలో 2.0 తర్వాత ఈ సినిమానే అత్యధికం అట.హిందీలో భారీ కలెక్షన్స్ రాకుండానే ఈ రికార్డ్ అందుకోవడం విశేషం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube